Sridevi : నాకు ఆ పిల్ల అంటే ఇష్టం, ఆ పిల్లకి ఏం అన్న అయితే ?

  • 6 years ago
Bollywood director Ram Gopal Varma today posted a heart-wrenching, passionate letter narrating his memories of the Sridevi Boney Kapoor.

అందాల తార శ్రీదేవి అంటే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు పిచ్చి. తన అందాన్ని ఆరాధించే వ్యక్తుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సమయం చిక్కినప్పుడల్లా శ్రీదేవి అందం గురించి వ్యక్తిగతంగానో, సోషల్ మీడియాలోనూ ఆయన వ్యక్తీకరిస్తుంటాడు. అంతగా అభిమానించే శ్రీదేవి ఇకలేరనే విషయాన్ని ప్రస్తుతం జీర్ణించుకోలేకపోతున్నారు. వరుస ట్వీట్లతో తన బాధను వెళ్లగక్కుతున్నారు..
శ్రీదేవి మరణవార్త వినగానే రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇదే.. ఈ రోజు దేవుడిని ద్వేషించినంతగా నేను ఎప్పుడూ ద్వేషించలేదు. నా ఆశాకిరణాన్ని దేవుడు ఆర్పివేశాడు. బోనికపూర్‌కు నా తీవ్ర సంతాపం అని ట్వీట్ చేశారు.
శ్రీదేవి మరణించిందా? నన్న ఓ వ్యక్తి లేపి.. నాకు ఆ వార్త చెప్పినప్పుడు నేను పీడకల కంటున్నానా అనిపించింది అని మరోట్వీట్ చేశాడు. మనల్ని అలా వదిలేసి వెళ్లడం సరైనదా మీరే చెప్పండి అంటూ మరో ట్వీట్ చేశాడు.
శ్రీదేవిని చంపిన దేవుడుంటే నాకు అసహ్యం. అలాగే ఇలా మరణించిన శ్రీదేవి అంటే కూడా కోపంగా ఉందని తన బ్లాగులో భారీసైజులో ఓ వ్యాసం రాశాడు కూడా అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నాడు. నీవు ఎందుకు ఏడుస్తావు.. నీవు చేసినదానికి మేమంత జీవితాంతం ఏడువాల్సి ఉంటుంది అని వరుస ట్వీట్లు చేశాడు.
సినిమా పరిశ్రమకు రావడానికి ప్రధాన కారణం శ్రీదేవినే. ఆమెను చాలా దగ్గరగా చూడటానికి వీలు అవుతుంది అనే ఉద్దేశంతో నేను సినిమాల్లోకి వచ్చాను. క్షణక్షణం సినిమా శ్రీదేవికి రాసిన నా ప్రేమలేఖ అని వర్మ ఓ ట్వీట్ చేశారు.
గోవిందా గోవిందా సినిమా షూటింగ్ సందర్బంగా బాలాజీ విగ్రహం ముందు శ్రీదేవితో దిగిన ఫొటోను రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఓ బాలాజీ.. నన్ను ఇక్కడే వదిలేసి.. ఆమె ఒక్కరినే ఎందుకు తీసుకెళ్లావు అని మరో ట్వీట్ చేశారు.

Recommended