ICC T20I rankings : Big jump for Dhawan and Bhuvneshwar

  • 6 years ago
After T20 series against South Africa, Bhuvneshwar Kumar and Shikhar Dhawan's improvement in their ICC T20I rankings.

దక్షిణాఫ్రికా పర్యటనలో ఆతిథ్య జట్టుపై భారత జట్టు విజృంభించి రెండు సిరీస్‌లు గెలిచింది. మొదటి సిరీస్ టెస్టుల్లో రెండు మ్యాచ్ లు మినహాయించి పర్యటనలో అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ అద్వితీయమైన ప్రదర్శన చేసింది. జట్టు విజయంలో బౌలర్లదే ప్రధాన పాత్ర అంటూ కెప్టెన్ కోహ్లీ నుంచి పలువురు సీనియర్ క్రికెటర్లు సైతం కొనియాడారు.
ఆ విషయం ఐసీసీ ర్యాంకింగ్స్ రూపంలో నిరూపితమైంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్‌, బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మెరుగైన స్థానాలను దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో గెలుచుకోవడంలో వీరివురూ కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే.
మూడు టీ20 మ్యాచ్‌లలో 143 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన భారత ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ టీ20ల్లో 14 స్థానాలను మెరుగుపరుచుకొని కెరీర్‌లోనే అత్యుత్తమంగా 28వ స్థానంలో నిలిచాడు. అటు ఇటు తడబడి రెండు సార్లు రనౌట్ అయినా స్కోరుతో మాత్రం మెరుగ్గా రాణించాడు.
ఇక బౌలింగ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' కైవసం చేసుకున్న బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కూడా 20 స్థానాలను మెరుగుపరుచుకొని బౌలర్లలో 12వ స్థానానికి చేరుకున్నాడు.
ఇక టీ20 సిరీస్‌ గెలుచుకున్న టీమిండియాకు ఒక పాయింట్‌ వచ్చి చేరింది. దీంతో 122 పాయింట్లతో మూడో స్థానంలోనే భారత్ కొనసాగుతుంది. మరోవైపు పాకిస్థాన్‌ 126 అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్‌ రెండో స్థానంలో నిలిచింది.

Recommended