IND vs SA : Bhuvneshwar First Indian Pacer To Take 5 Wickets In All Formats
  • 6 years ago
Indian pacer Bhuvneshwar Kumar on Sunday entered the record books with his career-best bowling figures of 5/24 in the first T20I against South Africa in Johannesburg

జోహెన్నస్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ (5/24) అద్భుత బౌలింగ్‌తో రాణించడంతో లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 175 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ తరఫున టీ20ల్లో ఐదు వికెట్లు సాధించిన తొలి పేస్ బౌలర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున టీ20ల్లో ఐదు వికెట్లు సాధించిన రెండో బౌలర్ భువనేశ్వర్. గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో చాహల్ ఆరు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.
గతేడాది చిన్నస్వామి స్టేడియంలో 4 ఓవర్లు వేసిన చాహల్ 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం విశేషం.
కాగా సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగానే ఉన్నప్పటికీ క్రీజులో బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోని ఉండటంతో పాటు చేతిలో వికెట్లు కూడా ఉన్నాయి. దీంతో దక్షిణాఫ్రికా అభిమానుల్లో ఎక్కడో గెలుపు ఆశ. అదే సమయంలో బెహార్డీన్‌ను చాహల్‌ ఔట్‌ చేయడంతో 81 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.
మరోవైపు హెండ్రిక్స్‌ దూకుడుగా ఆడటం, క్లాసన్‌ (16) దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించడంతో 17 ఓవర్లకు దక్షిణాఫ్రికా 154/4తో నిలిచింది. దీంతో 18 బంతుల్లో దక్షిణాఫ్రికా విజయానికి 50 పరుగులు అవసరమయ్యాయి. టీ20ల్లో ఇది సాధ్యమే. కానీ ఆతిథ్య జట్టు ఆశలపై భువీ నీళ్లు చల్లాడు.
భారత విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో భువీ హ్యాట్రిక్ దెబ్బకు సఫారీలు చిత్తయ్యారు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి టీ20లో నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. మొదటిసారి టీ20ల్లో 5 వికెట్లు తీసిన భువీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం లభించింది.
Recommended