Jaya Bachchan Could Be Mamata Banerjee’s Choice

  • 6 years ago
Trinamool Congress to nominate Samajwadi Party (SP) leader Jaya Bachchan as its candidate from West Bengal to Rajya Sabha, sources said. Jaya Bachchan’s third term in the Upper House comes to an end on April 3.

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తనకు మద్దతుగా నిలతిచిన బాలీవుడ్ నటి, ఎంపీ జయా బచ్చన్‌ను తమ పార్టీ తరపున పెద్దల సభకు పంపాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. టీఎంసీ సీనియర్‌ నేత ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించడం గమనానర్హం. జయ ఓ సమర్థవంతమైన నాయకురాలని.. పైగా ఆమెకు బెంగాలీ మూలాలు ఉన్నాయని చెప్పారు. అందుకే ఆమెను మా పార్టీ తరపున రాజ్యసభకు పంపాలని నిర్ణయించాం' అని సదరు నేత వెల్లడించారు.
టీఎంసీ తరపున నలుగురు ఎంపీల పదవీకాలం ముగుస్తుండగా.. ఈసారి రెండే సీట్లే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, సమాజ్‌వాదీ పార్టీ(యూపీ నుంచి) తరపున రాజ‍్యసభకు జయ బచ్చన్‌ ఇప్పటికే మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఏప్రిల్‌ 3న ఎంపీగా ఆమె కాలపరిమితి ముగియనుంది.
కాగా, మార్చి 18న మమత స్వయంగా అభ్యర్థిగా జయా బచ్చన్‌ పేరును ప్రకటించే అవకాశం ఉందని టీఎంసీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏప్రిల్‌లో రాజ్యసభలో 58 మంది ఎంపీల కాలపరిమితి ముగుస్తోంది. వీటిలో ఉత్తర ప్రదేశ్‌ నుంచే 10 సీట్లు ఖాళీ కానున్నాయి.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గరిష్ఠంగా 312 సీట్లు కైవసం చేసుకోవటంతో ఈ దఫా వారికే రాజ్యసభలో ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీకి ఒకే సీటు దక్కే అవకాశం ఉండటంతో మమతను సంప్రదించినట్లు తెలుస్తోంది.
కొన్నాళ్ల క్రితం బీర్భూమ్‌ నగరంలో హనుమాన్‌ జయంతి ర్యాలీ మీద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆంక్షలు విధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేవైఎం నేత యోగేష్‌ వర్ష్నే మమతను ఎవరైనా చంపితే 11 లక్షలు ఇస్తానంటూ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ రాజ్యసభలో తీవ్రంగా మండిపడ్డారు. 'మీరు ఆవులను కాపాడతామని చెబుతున్నారు గానీ మహిళల సంగతేంటి' అని ఆమె బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పుడు అండగా నిలిచిన జయా బచ్చన్‌కు ఇప్పుడు రాజ్యసభ సీటు ఇచ్చి ఆ రుణ్నాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Recommended