PNB Fraud : Nirav Modi, $ 1.6 Billion Fraud : CBI Alerts Interpol
  • 6 years ago
Enforcement Directorate (ED) is making searches at Nirav Modi's Gatanjali Show rooms and Ravirala Zems park in Hyderabad. In a major development to the PNB fraud case, the Interpol has issued diffusion notice against Nirav Modi, his wife Ami Modi, brother Nishal Modi and his business partner and uncle Mehul Choksi.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బీ) భారీ కుంభకోణం ప్రధాన సూత్రదారి నీరవ్ మోడీకి హైదరాబాదుతో ఉన్న సంబంధాలు కూడా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాదులోని ఆస్తులు, షోరూంలు, ఆఫీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాదులోని రావిరాలలో న్న జెమ్స్ పార్కుపై ఈడి దాడులు నిర్వహిస్తోంది. దానికితోడు నీరవ్ మోడీకి చెందిన గీతాంజలి షోరూంల్లో కూడా ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు
గత దశాబ్దకాలంగా గీతాంజలి జెమ్స్ పేరుతో నీరవ్ మోడీ వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాదు, సూరత్, ముంబైల్లో గీతాంజలి షోరూంలు ఉన్నాయి. హైదరాబాదు దాడుల్లో ఈడి అధికారులు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన సూత్రధారి నీరవ్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులపై ఇంటర్‌పోల్ అప్రమత్తమైంది. వారిపై డిఫ్యూజన్ నోటీసు జారీ చేసింది. నీరవ్ మోడీపైనే కాకుండా ఆయన భార్య అమీ మోడీ, సోదరుడు నిషాల్ మోడీ, ఆయన వ్యాపార భాగస్వామి, అంకుల్ మహెుల్ చోక్సీలపై డిఫ్యూజన్ నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
బిలియనీర్ జువెల్లరీ డిజైనర్ నీరవ్ మోడీ, ఆయన భాగస్వామి మెహుల్ చోక్సీ పాస్‌పోర్టులను రద్దు చేయాలని సిబిఐ కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చిన 150 అవగాహన లేఖలతో రూ.11,300 కోట్ల అక్రమ లావాదేవీల కేసులో వారిద్దరు ప్రధాన నిందితులు.
భారీ కుంభకోణానికి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుక్రవారం మరో 8 మందిఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగుల సంఖ్య 18కి చేరుకుంది. సస్పెండ్ అయినవారలో జనరల్ మేనేజర్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అంతర్గత విచారణ జరుగుతున్నట్లు బ్యాంక్ తెలిపింది.
Recommended