Ind vs SA ODI : After Series Win Kohli Promises
  • 6 years ago
India captain Virat Kohli described his team's 73-run win in the 5th ODI against South Africa as a clean and complete performance. We want to win 5-1 Series Win said kohli.

ఆరు వన్డేల సిరిస్‌ను 5-1తో ముగించడమే తమ ముందున్న లక్ష్యమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. పోర్ట్ ఎలిజబెత్‌ వేదికగా మంగళవారం జరిగిన ఐదో వన్డేలో ఆతిథ్య సఫారీ జట్టుపై 73 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుని కోహ్లీసేన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఐదో వన్డేలో విజయం సాధించడంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. కెప్టెన్‌గా 48 వన్డే మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన కోహ్లీకి ఇది 37వ విజయం. అంతకాదు టీమిండియా వరుసగా 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలుచుకొంది. ఐదో విజయానంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు.
సిరీస్‌ గెలిచాం కదా అని సంబరపడిపోకుండా చివరి వన్డేను సైతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 'చాలా చాలా సంతోషంగా ఉంది. గెలిస్తే చరిత్ర సృష్టిస్తామని జట్టులో అందరికి తెలుసు. విజయం కోసం చాలా కష్టపడ్డాం. సాధించాం.. ఇది మాకు మరో సమిష్టి ప్రదర్శనతో దక్కిన విజయం. మాపై ఒత్తిడి లేకపోవడంతోనే సిరీస్‌ గెలిచామనే విషయం అర్థమైంది' అని కోహ్లీ అన్నాడు.
'స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. గెలిచాం కదా అని చివరి వన్డేను తేలికగా తీసుకోం. ఇప్పుడు మా లక్ష్యం 5-1తో సిరీస్‌ ముగించడమే. అయితే, ఇప్పటి వరకు అవకాశం రాని ఆటగాళ్లకు చివరి వన్డేలో రావచ్చు. ఏది ఏమైన గెలవడమే మా ప్రాధాన్యత. దాని కోసం ఏమైనా చేస్తాం' అని కోహ్లీ అన్నాడు.


Recommended