A minor girl was excommunicated and her head was half shaved over incident of eve teasing in Kawardha of Chhattisgarh
లైంగిక వేధింపులకు గురైన పదమూడేళ్ల బాలికకు శుద్ధీకరణ పేరుతో గ్రామ పెద్దలు అరగుండు చేయించారు. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కవర్ణాలో చోటు చేసుకొంది.బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు మాత్రం గ్రామంలో యధేచ్చగా తిరుగుతున్నారు. మైనర్ అని చూడకుండా బాధితురాలిని గ్రామం నుండి బహిష్కరించాలని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిని దండించాల్సింది పోయి, బాధితురాలికి శిక్ష విధించారు