Mohan Babu Open Challenge To Film Industry
  • 6 years ago
Mohan Babu is an Indian film actor, director, and producer, known for his works predominantly in Telugu Cinema. In his Latest Interview he shared so many things. An actress spread rumours about me that I am a rough guy but people who are undisciplined will suffer later said Mohan Babu

మోహన్ బాబు అంటే డిసిప్లెన్, డిసిప్లెన్ అంటే మోహన్ బాబు అనే పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు. మోహన్ బాబు కాంపౌండులో స్ట్రిక్ట్ రూల్స్‌ కారణంగా ఆయనతో చేయడానికి భయపడే వారు చాలా మంది ఉన్నారు. తాజాగా మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు, తనపై వయస్తున్న కొన్ని ఆరోపణలకు సంబంధించి వివరణ ఇచ్చారు.
నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చి కొంతమంది హీరోలు నా గురించి ఇండస్ట్రీలో చెడుగా ప్రచారం చేశారు. ముఖ్యంగా హీరోయిన్లకు నా గురించి ఏదో చెప్పి భయపెట్టేవారు. దీంతో కొందరు హీరోయిన్స్ నాకు ఇచ్చిన డేట్స్ ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి. వారి మాటలు పట్టించుకోకుండా నాతో నటించిన మంచి హీరోయిన్లు కూడా ఉన్నారు అని.... అని మోహన్ బాబు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
మీరంటే ఇప్పటి యంగ్ జనరేషన్ డైరెక్టర్లు భయపడుతున్నారు అనే ప్రశ్నకు మోహన్ బాబు స్పందిస్తూ.....వాళ్లకు నా మీద ఇష్టం లేక పోవచ్చు. వారి సినిమాల్లో నాకు క్యారెక్టర్ లేక పోవచ్చు. నేను అంటే ఎందుకు భయం. ఏం భయం అనేది భయపడే వారినే అడగాలి. నీకు 7 గంటలకు షూటింగ్ అంటే ఆరున్నరకే వస్తాను. ఒక సినిమాకు ఒక అమౌంట్ మాట్లాడుకున్న తర్వాత ఎక్కువ ఇవ్వమని ఎప్పుడూ అడగలేదు... అని మోహన్ బాబు తెలిపారు.
దర్శకుడు సూర్యకిరణ్ పై మీరు చేయి చేసుకున్నారట? కదా అనే ప్రశ్నకు మోహన్ బాబు స్పందిస్తూ..... 'ఈ రోజున సూర్య కిరణ్ ఆ మాట చెబితే మీకు నా యావదాస్తిని ఇచ్చేస్తాను. ఒకవేళ సూర్య కిరణ్ అలాంటిదేం లేదంటే మీరేమిస్తారో చెప్పండి' అంటూ మోహన్ బాబు ఎదురు ప్రశ్నించారు. నా గురించి అలా అనుకుంటున్నారంటే "ఇలాంటివన్నీ మూర్ఖులు అనుకుంటూ ఉంటారు, బుర్ర పనిచేయని వాళ్లు అనుకుంటారు. నా దృష్టిలో దర్శకుడు రథసారథి వంటివాడు" అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
Recommended