Chiranjeevi Trying To Look A Bit Younger

  • 6 years ago
Megastar Chiranjeevi will head to Vishakapatnam for one week later this month. The Megastar will undergo the naturopathy treatment there which will make a person look a bit younger than the age and the treatment will also bring a glow to the skin.

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టారు. ఇక సినిమాల్లోనే కొనసాగాలని డిసైడ్ అయ్యారు. రాజ్య సభ ఎంపీగా ఉండి కూడా ఆయన ఇటీవల కేంద్ర బడ్జెట్ మీదగానీ, ఏపీకి జరుగుతున్న అన్యాయంపైగానీ స్పందించలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆయన గురువారం జరిగిన ఏపీ బంద్‌లో కూడా పాల్గొనలేదు. ప్రస్తుతం చిరంజీవి దృష్టంతా తన తాజా చిత్రం 'సైరా' మీదనే ఉంది. ఈ సినిమా కోసం ఆయన పిట్‌నెస్ పరంగా, లుక్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ట్రీట్ మెంట్ కోసం త్వరలోనే చిరంజీవి వైజాగ్ వెళుతున్నట్లు తెలుస్తోంది. నేచురోపతి ట్రీట్ మెంట్ కోసం ఆయన అక్కడకు వెళ్లబోతున్నారని టాక్.
సైరా' సినిమాలో చిరంజీవి యంగ్ లుక్‌తో కనిపించాలి. ఇందులో భాగంగానే ఆయన ఈ ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారట. ఈ చికిత్స ద్వారా శరీరం కాంతివంతం అవుతుందని, స్కిన్ రేడియేట్ అవుతుందని అంటున్నారు.
అయితే ఈ ట్రీట్మెంట్ విషయాన్ని యూనిట్ సభ్యులతో పాటు, చిరంజీవి కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారు. బయటకు తెలిస్తే దీని గురించి మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు సమాచారం.
సైరా' చిత్రం కాస్త లేటుగా ప్రారంభం అయినా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తవ్వగా..... ఫిబ్రవరి నుండి నుండి సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. మెగా తనయుడు రామ్ చరణ్ చిత్ర నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు.

Recommended