Union Budget 2018 : బీజేపీతో టీడీపీ పొత్తు..ఇంటికి రాదు విత్తు

  • 6 years ago
TDP State president Kala Venkat Rao and Nellore Urban Development Authority (NUDA) Chairman K Srinivasulu addressed a cabinet meeting in the capital Amaravati. The ministers admitted that there is dissatisfaction among the people as well as government, as there are no allocations in the Union Budget 2018 to the state that is suffering from bifurcation


కేంద్ర బడ్జెట్ పైన ఏపీలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో ఉంది. సాధారణ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు, సుజనా చౌదరి, అవంతి శ్రీనివాస్, జేసీ దివాకర్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రులు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, మరో నాయకుడు కొణతాల రామకృష్ణ.. ఇలా అందరూ విరుచుకుపడ్డారు.
బడ్జెట్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులుతో భేటీ అయ్యారు. అంతకుముందు ఎంపీలు, టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు కూడా బడ్జెట్ పైన మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. విభజన హామీలను దృష్టిలో పెట్టుకున్నట్లు బడ్జెట్‌లో కనిపించలేదని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. రైల్వే జోన్ సహా ఏ అంశంపై ఆశించినట్లుగా రాలేదన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడమే ఉత్తమమని వారు ఒత్తిడి చేశారని తెలుస్తోంది.
బడ్జెట్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంపై టీడీపీ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది.

Recommended