పవన్ కొత్త డిమాండ్, అపశృతి: హోదాపై మాట్లాడవేం పవన్ ?

  • 6 years ago
Puttaparthi Hanuman Nagar was completely over crowded with people due to Pawan's craze. Pawan Kalyan while addressing public at Hanuman Circle in Puttaparthi said Janasena will work out on the possibilities of making Puttaparthi as a district.

విద్య, వైద్య రంగాల్లో పుట్టపర్తి సత్య సాయిబాబా విశేష సేవలందించారని జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. కదిరి పర్యటన అనంతరం ఆయన పుట్టపర్తి చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సత్యసాయి స్ఫూర్తితో జనసేన ముందుకు పోతుందన్నారు.
సత్య సాయిబాబా సేవలకు గుర్తింపుగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. సత్యసాయి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. పవన్ అంతకుముందు కదిరి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.
కదిరి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో పవన్‌కు అర్చకులు, ఆలయ అధికారులు ఆలయ పద్ధతుల ప్రకారం ఘన స్వాగతం పలికారు. కదిరి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించిన తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. పవన్‌ని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
కదిరిలో పర్యటించిన ఆయన ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించారు. బాధిత రైతు కుటుంబాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతపురంలో ప్రకృతి అనుకూలంగా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి సమస్యలను పరిష్కరించాలన్నారు. మానవ మేధస్సు గొప్పదని, ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు.

Recommended