Republic Day celebrations : BSF మహిళా సైనికులు అద్భుత ప్రదర్శన
  • 6 years ago
An all-women contingent of the Border Security Force (BSF) left the audiences awestruck when they displayed stunts on the Rajpath during the Republic Day celebrations.

69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టకున్నాయి. కాగా, బీఎస్‌ఎఫ్‌కు చెందిన మహిళా బైకర్స్‌ బృందం ప్రదర్శించిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలిసారి చేసినా.. అద్భుతంగా చేశారంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. వేడుకల్లో సైనిక దళాల పరేడ్‌ ఆకట్టుకుంది. టీ-90 యుద్ధ ట్యాంకర్ల ప్రదర్శనతో పరేడ్‌ ప్రారంభమైంది. వేడుకల్లో ముఖ్యఅతిథులుగా హాజరైన పది దేశాలకు సంబంధించిన జెండాలను ప్రదర్శించారు. ఆర్మీ, వాయు సేన, నావికా దళాలలకు చెందిన శకటాలతో పాటు బీఎస్‌ఎఫ్‌ దళాలు, ఇండో టిబెటిన్‌ బార్డర్‌ పోలీసు బలగాలు, సశస్త్ర సీమబల్‌ బ్యాండ్, దిల్లీ పోలీసులు, ఎన్‌సీసీ బృందాల ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఆకాశ్‌ క్షిపణి, బ్రహ్మోస్‌ క్షిపణులను కూడా ప్రదర్శించారు. బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్‌(బీఎస్ఎఫ్)కు చెందిన మహిళా సైనికులు అద్భుత ప్రదర్శన చేపట్టారు. రాజ్‌పథ్‌లో సీమా భవానీ వుమన్ బైకర్స్ విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆర్డీ పరేడ్‌లో మహిళా మోటర్ సైకిల్ టీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Recommended