జనసేనలోకి కీలక నేతలు, ఎవరికి షాక్ !

  • 6 years ago
Pawan Kalyan has launched Jana Sena party during 2014 general elections and since then he has been acting as the whole and sole of this party. Some top leaders try to join Janasena

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై జనసేన ప్లాన్ చేస్తోంది.ఇతర పార్టీల నుండి కొందరు నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలతో జనసేన టీమ్ ఇప్పటికే చర్చించినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ దిశగానే తాను రాజకీయాలను చేయనున్నట్టు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాత్రం పోటీ చేయలేదు. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ బిజెపి,టిడిపి కూటమికి మద్దతును ప్రకటించారు. కానీ, 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొందరు రిటైర్డ్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు జనసేనలో చేరే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మేరకు ఆయా వర్గాలు ఇప్పటికే జనసేనతో సంప్రదింపులు జరిపేందుకు సానుకూలంగా స్పందించాయని సమాచారం. వారితో కూడ త్వరలోనే జనసేన వర్గాలు చర్చించే అవకాశాలున్నాయి.

Recommended