దిల్‌రాజుకు దెబ్బ మీద దెబ్బ.. అప్పుడు స్పైడర్.. ఇప్పుడు అజ్ఞాతవాసి..!

  • 6 years ago
Agnyaathavaasi movie given shock to producer Dil Raju. This movie distributed by Dil Raju. According to buzz, he paid Rs.29 crores for Nizam distribution rights for this movie. But this movie collected Rs.11 Crores.


అజ్ఞాతవాసి బ్లాక్‌బస్టర్ అవుతుందని పెట్టుబడి పెట్టిన డిస్టిబ్యూటర్లందరి పరిస్థితి చెప్పరాని విధంగా ఉన్నట్టు సినీ వర్గాల టాక్. జల్సా, అత్తారింటికి దారేది తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. దాంతో రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం నిర్మాత దిల్ రాజుకు భారీగా నష్టాన్ని తెచ్చినట్టు సమాచారం.
అజ్ఞాతవాసి చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. విడుదలకు ముందే 150 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో ఇది ఓ రికార్డుగా నమోదైంది.
థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు
తెలుగు శాటిలైట్ రైట్స్ 19 కోట్లు
ఇతర భాషల శాటిలైట్ రైట్స్ 6 కోట్లు
డిజిటల్ రైట్స్ 7 కోట్లు
ఇతర హక్కులకు 3 కోట్లు
మొత్తంగా అజ్ఞాతవాసి చిత్రం రూ.155 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ఓ రికార్డు.

Recommended