అది మనసులో పెట్టుకున్నారా? బన్నీ మౌనం పై ఫ్యాన్స్ రచ్చ!

  • 6 years ago
Ram Charan, Sai Dharam Tej, Varun Tej supports Pawan Kalyan Politically. Ram Charan tweeted 'I'm an Indian. I care for my motherland"- Pawan Kalyan. What an energetic start of Chalo re Chalo re chal. Babai, wishing you all the best!! Jai Jana Sena!!'.

ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ మధ్య 'చెప్పను బ్రదర్' వివాదం రేగిన సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో రచ రచ్చ చేశారు. చాలా రోజుల తర్వాత మళ్లీ బన్నీ గురించి పవన్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పవన్ క ళ్యాణ్ రాజకీయాత్ర ప్రారంభించిన నేపథ్యంలో ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది.
పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర ప్రారంభమైన నేపత్యంలో రామ్‌ చరణ్‌ మరియు మెగా ఫ్యామిలీ హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లు పవన్‌ కళ్యాణ్ కు 'ఆల్‌ ది బెస్ట్‌' చెబుతూ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
అయితే అల్లు అర్జున్ మాత్రం పవన్ రాజకీయ యాత్రపై స్పందించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే బన్నీ విషెస్ చెప్పక పోవడాన్ని కొందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ తప్పుబడున్నారు. బన్నీ కూడా విష్ చేసి ఉంటే బావుండేదని, అతడు విష్ చేయక పోవడం వల్ల ..... ఇద్దరి మధ్య ఏదో క్లాష్ ఉందనే సంకేతాలు వెళుతున్నాయని అంటున్నారు.
బన్నీ కంటే యాక్టివ్‌గా అతడి బ్రదర్ అల్లు శిరీష్ కూడా పవన్ రాజకీయ ప్రవేశంపై స్పందించలేదు. కావాలనే ‘అల్లు' వారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీకి అంటీ ముట్టనట్లు ఉంటున్నారని అభిమానుల్లో చర్చ సాగుతోంది.
అల్లు అరవింద్ మీద పవన్ కళ్యాణ్ ఇటీవల ఆసక్తకర కామెంట్స్ చేశారు. "ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడతావా? అంటూ కొందరు నన్ను ప్రశ్నించొచ్చని కానీ.. తాను అప్పట్లో నిస్సహాయుడ్ని అంటూ ఒక ఉదాహరణను చెప్పుకొచ్చారు. బహుషా ఆ కామెంట్స్‌ను మనసులో పెట్టుకుని ‘అల్లు'వారు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు, జనసేనకు దూరంగా ఉంటున్నారా? అని చర్చించుకుంటున్నారు.

Recommended