'ఇంటిలిజెంట్'పై కత్తి కామెంట్..!

  • 6 years ago
Here is the first look of Sai Dharam Tej's 'Intelligent'. 'Supreme Hero' Sai Dharam Tej is struggling for a hit for the past two years.

పవన్ ఫ్యాన్స్‌తో వివాదంపై మెత్తబడ్డప్పటికీ.. ప్రజాస్వామ్య బద్దంగా ఎప్పటిలాగే తన విమర్శలు కొనసాగుతాయని ఫిలిం క్రిటిక్ మహేష్ కత్తి తెలిపిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఇంతకుముందు లాగే ఆయన తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదలైన సాయిధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్' పోస్టర్ పై మహేష్ కత్తి పెదవి విరిచారు..
'ఇంటిలిజెంట్' ప్రీ లుక్‌పై మహేష్ కత్తి తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. చేతికి బ్యాండేజ్‌తో గన్ పట్టుకుని ఉన్న పోస్టర్ అంత ఇంటెలిజెంట్‌గా లేదని చెప్పారు. 'తెలివైనవాడు గాయపడిన చేత్తో గన్ పట్టుకోవడం ఏమిటో! టైటిల్‌కి తగ్గ పోస్టర్ అయితే కాదు' అని కామెంట్ చేశారు.
మహేష్ కత్తి కామెంట్ పక్కనపెడితే.. ఈ సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలోనూ కొన్ని సెటైర్స్ పడుతున్నాయి. 'ఇంటెలిజెంట్' అన్న పదాన్ని 'ఇంటి'లిజెంట్‌గా మార్చేశారని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే టైటిల్ ఇలా పెట్టడంలో కథకేమైనా లింక్ ఉందేమో అనేవారు లేకపోలేదు.
సాధారణంగా వినాయక్ అంటేనే పక్కా మాస్ డైరెక్టర్ అన్న పేరు. గత కొంతకాలంగా మాస్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నిస్తున్న సాయిధరమ్ తేజ్.. అందులో భాగంగానే ఇప్పుడాయన సినిమాలో నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో వినాయక్ 'మాస్' మార్క్ మిస్ అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సాయిధరమ్ విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడట. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ 'ఇంటిలిజెంట్' చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Recommended