విజయ్ అంటే ఇప్పుడు అల్లా టప్పా కాదు.. అందుకే ఇలా?

  • 6 years ago
Almost all the movies Vijay Devarakonda did till now are of a budget of below 5 crores but in this upcoming movie with Geetha arts the budget of the movie is expected to be Rs. 10 crores.

కంటెంట్ ఉండాలే కానీ ఓవర్ నైట్ స్టార్ అయిపోవడానికి ఒక్క సినిమా చాలు. 'అర్జున్ రెడ్డి'తో ఇదే నిరూపించాడు హీరో విజయ్ దేవరకొండ. ఒకే ఒక్క సినిమాతో యూత్‌లో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించాడు. అందుకే విజయ్‌తో సినిమాలు చేస్తున్నవాళ్లంతా ఇప్పుడు అలర్ట్ అయిపోయారు. 'అర్జున్ రెడ్డి'ని మరిపించే క్యారెక్టరైజేషన్‌తో విజయ్‌ని చూపించడం ఇప్పుడు వాళ్లకో సవాల్‌లా మారింది.. అదొక్కటే కాదు..
'అర్జున్ రెడ్డి' కంటే ముందే విజయ్ దేవరకొండ కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాడు. అందులో గీత ఆర్ట్స్ బేనర్‌లో పరుశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఉంది. నిజానికి ఈ సినిమా బడ్జెట్ తొలుత రూ.5కోట్లే అనుకున్నట్లు తెలుస్తోంది. కానీ 'అర్జున్ రెడ్డి' చూశాక పునరాలోచనలో పడక తప్పలేదట.
'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ దేవరకొండకు పెరిగిన పాపులారిటీ రీత్యా.. కచ్చితంగా ఈ హీరో సినిమాలకు ఓపెనింగ్స్ ఢోకా ఉండదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. అందుకే.. గీత ఆర్ట్స్ సైతం నిర్మాణ విలువల విషయంలో ఎక్కడ తగ్గవద్దన్న ఉద్దేశంతో బడ్జెట్ పెంచినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.10కోట్ల పైచిలుకు బడ్జెట్ తో విజయ్ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.
అర్జున్ రెడ్డి చూశాక.. దర్శకుడు పరుశురామ్ కొన్ని సీన్లు మళ్లీ రీషూట్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌కి ఉన్న క్రేజ్ రీత్యా.. ఆ అంచనాల్ని అందుకునేందుకు పరుశురామ్ బాగానే కష్టపడుతున్నాడట .
పరుశురామ్ సినిమా ఒక్కటేకాదు.. 'అర్జున్ రెడ్డి' కంటే ముందే విజయ్‌తో సినిమా మొదలుపెట్టినవాళ్లంతా ఇప్పుడు బడ్జెట్, స్క్రిప్టు విషయంలో మళ్లీ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
అయితే రీల్ లైఫే కాదు.. రియల్ లైఫ్ లోనూ విజయ్ మాట తీరు అంతే సహజంగా ఉంటుంది. తాజాగా తనదైన శైలిలో విజయ్ ఓ ఫన్నీ ట్వీట్ చేశారు. వేప ఆకులు, తంగేడు పూలు, గులాబీ రెమ్మలతో 'అర్జున్ రెడ్డి' లుక్ ని తలపించేలా చిత్రాన్ని డిజైన్ చేసిన ఓ అభిమానిని ఉద్దేశించి.. 'అన్నా.. నీకో దండం..' అంటూ ట్వీట్ చేశాడు విజయ్. సంక్రాంతి కానుకగా ఓ అభిమాని విజయ్‌కి దీన్ని కానుకగా ఇచ్చాడు.

Recommended