హైదరాబాద్ లో డీఎన్ఏ పరీక్షలు చెయ్యాలంటున్న అమృత !

  • 6 years ago
Bengaluru Amrutha, who claims to be the biological daughter of the late Tamil Nadu Chief Minister Jayalalithaa, has got in touch with a city-based DNA expert through her lawyer in order to have her DNA testing done at the Centre for Cellular and Molecular Biology (CCMB), Hyderabad, once the court allows this.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె అంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన బెంగళూరు అమృత సారథి.. అలియాస్ అమృత, తన రక్త సంబంధాన్ని నిరూపించటానికి డీఎన్‌ఏ పరీక్షలకు సిద్ధమైనారు. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)ని అమృత ఆమె న్యాయవాది సహాయంతో సంప్రదిస్తున్నారు.
బెంగళూరుకు చెందిన అమృత తమకు ఇప్పటి దాకా ఎలాంటి రక్తపు నమూనాలూ పంపించలేదని సీసీఎంబీ వర్గాలు చెబుతున్నాయి. తాను జయలలిత కుమార్తె అని నిరూపించుకొనేందుకు అవకాశం ఇవ్వాలంటూ అమృత మద్రాసు హై కోర్టును ఇప్పటికే ఆశ్రయించారు.
సాధారణంగా ప్రైవేట్‌ వ్యక్తులకు సంబంధించిన డీఎన్‌ఏ పరీక్షలను సీసీఎంబీ చేయ్యదు. కోర్టులు ఆదేశిస్తే మాత్రమే సీసీఎంబీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తోంది. తల్లిదండ్రులు లేదా బంధువుల రక్తపు నమూనాల ద్వారా ఒక వ్యక్తికి వారితో ఉన్న సంబంధాన్ని నిరూపించడానికి అవకాశం ఉంటుంది.
బెంగళూరుకు చెందిన అమృత తల్లిదండ్రులు మరణించారు. అందువలన వారి బంధువుల నుంచి తీసుకున్న రక్తపు నమూనాను పరీక్షించి ఆమెకు జయలలితకు రక్త సంబంధం ఉందా? లేదా ? అని నిరూపించడానికి అవకాశం ఉంటుంది.
వై క్రోమోజోమ్‌లను గుర్తించే వై ఎస్టీఆర్‌ అనే పరీక్షల ద్వారా రక్తసంబంధాలను గుర్తిస్తారు. ఈ పరీక్షల చేయగల సామర్థ్యం, పరికరాలు తెలంగాణలోని హైదరాబాద్ లోని సీసీఎంబీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని డీఎన్‌ఏ నిపుణులు అంటున్నారు.

Recommended