సుప్రీంకోర్టుకైనా వెళ్తాం.. కేసీఆర్, నీతి ఆయోగ్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్..!

  • 6 years ago
NITI Aayog Vice-Chairman Rajiv Kumar today hinted that Andhra Pradesh neither required “handholding” nor special category status given its economic growth story.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రెండో రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ, శాంతి భద్రతలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు సమావేశంలో మాట్లాడారు. నాడు యూపీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని ఆయన అన్నారు.
గురువారం ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఆంధ్రతో తెలంగాణకు పోలికే లేదని కేసీఆర్ అనడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. రాజధాని కాబట్టే ఏపీ ప్రజలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. తెలంగాణను ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారనడం బాధాకరమని అన్నారు. 1995కు ముందు, ఆ తర్వాత ఫలితాలను చూస్తే వాస్తవాలు తెలుస్తాయని, చంద్రబాబు.. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు.
అయితే, తాను తెలంగాణ ప్రజలను నిందించను అని,హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజన చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విభజన కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామన్నారు. ఆంధ్రా పాలకులు తెలంగాణను విధ్వంసం చేశారన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీనియర్‌ ఐఏఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేశారన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య కూడా అభ్యంతరం తెలిపారు.

Recommended