కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్

  • 6 years ago
Revanth Reddy Powerful Speech on KCR and KTR in Gandhi Bavan Congress Meeting.

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం టీఆర్ఎస్‌లో ప్రారంభమైనా.. సమీకరణాలు సరిగ్గా కుదరకపోవడంతో శాసనమండలి పునరుద్ధరణ తర్వాత ఇండిపెండెంట్‌గా గెలుపొంది టీడీపీలో చేరారు. 2009లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన రేవంత్ రెడ్డి 2014 ఎన్నికల వరకు సాధారణంగానే వ్యవహరించారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ లక్ష్యంగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 2015లో ఎమ్మెల్సీ కోటాలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న రేవంత్ రెడ్డి జైలు జీవితం కూడా గడిపారు. నాటి నుంచి సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న రేవంత్ తనకంటూ తెలంగాణలో ప్రత్యేక ఇమేజీ సంపాదించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు కోసం ప్రయత్నిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుచక్రం వేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని సంకేతాలివ్వడంతో సుమారు 15 మంది నేతలతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెసు నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు, మంత్రి కెటి రామారావును టార్గెట్ చేశాడు. కెటిఆర్‌ను ఆయన లక్ష్యం చేసుకోవడంలో పక్కా వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. కెటిఆర్‌ను టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి కుంభస్థలాన్ని కొట్టాలని భావిస్తున్నట్లు ఉన్నారు. ఆయన ఆరోపణలకు

Recommended