'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్ ? ఆరోజు ఏం చేస్తారు ?

  • 6 years ago
The controversy surrounding Kathi Mahesh’s comments on Pawan Kalyan and the backlash that followed is growing bigger by the day.

ఆదివారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పెట్టిన మీటింగ్‌తో మహేష్ కత్తి-పవన్ కల్యాణ్ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఇప్పటిదాకా పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకుండా సంయమనం పాటిస్తూ వచ్చిన కత్తి మహేష్.. ఇప్పుడు ఆ హద్దును కూడా దాటేశారు. అయితే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పూనం కౌర్ కత్తి మహేష్ పై చేసిన వ్యాఖ్యల పర్యవసానమే ఆయన సంధించిన ప్రశ్నలు అనుకోవచ్చు. ఏదేమైనా పవన్ దిగొచ్చేదాకా తన పోరాటం ఆగదంటున్న మహేష్ కత్తిపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టి ప్రతిస్పందన మొదలైంది. హైపర్ ఆది మరోసారి ఘాటు విమర్శలు చేయగా.. కోన వెంకట్ సున్నితంగా ఓ విజ్ఞప్తి చేశారు.
'ఈ నెల 15వ తేదీ వరకు అందరూ మౌనంగా ఉండండి, మౌనం ఎప్పటికీ మోసం చేయదు. పవన్ అభిమానులతో పాటు కత్తి మహేశ్ కూడా మౌనం వహించి మీడియా హౌజ్ లకు, పవన్ పై వ్యతిరేక వ్యాఖ్యలకు కాస్త దూరంగా ఉండండి. లేదంటే సయోధ్య కుదుర్చాలనుకున్న ప్రయత్నం విఫలమవవుతుంది' అన్నారు. అయితే జనవరి 15వరకు అని ఒక డెడ్ లైన్ పెట్టారంటే.. ఆరోజు పవనే నేరుగా రంగంలోకి దిగుతారా? అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Recommended