దీపిక కు భయపడుతున్న టాలీవుడ్ టాప్ హీరోస్..!

  • 6 years ago
There were speculations that the Padmavati movie might come out on Feb 9th. On the same day Saidharam and Varun Tej movies also hitting the silver screen, due to the padmavati both hero's are now in tension.

సినిమా విడుదలకు తేదీతో సహా అన్నీ పక్కాగా ఖరారు చేసుకున్న సమయంలో.. మరో పెద్ద సినిమా కూడా అదే తేదీకి రాబోతుందని తెలిస్తే కచ్చితంగా టెన్షన్ పెరగడం ఖాయం. మెగా కాంపౌండ్ హీరోలకు ఇప్పుడిదే భయం పట్టుకుంది. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ సినిమాల విడుదల రోజే.. 'పద్మావతి' విడుదలవుతుండటం వారిలో ఆందోళన పెంచుతోంది..
సాయిధరమ్ తేజ్-వినాయక్ కాంబినేషన్‌లో వస్తున్న ఇంటలిజెంట్, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'తొలిప్రేమ' సినిమాలు ఫిబ్రవరి 9న విడుదలకు ప్లాన్ చేసుకున్నాయి. కానీ అదే రోజు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'పద్మావతి' కూడా బరిలో దిగుతుండటంతో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లలో ఆందోళన పెంచింది.
పద్మావతితో పాటు బరిలో దిగితే ఓపెనింగ్స్ కు దెబ్బ పడవచ్చునని సాయిదరమ్ తేజ్, వరుణ్ తేజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎటూ పద్మావతి సినిమానే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ గా ఉంటుంది.. దానికి తోడు సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. జనాలంతా ఇక అటువైపే 'క్యూ' కట్టేస్తారు. కాబట్టి పద్మావతితో బరిలో దిగడం సరైందా ? కాదా ? అన్న ఆలోచనలో ఈ ఇద్దరు టాప్ హీరోలు వున్నట్లు తెలుస్తుంది.
పద్మావతి విషయానికొస్తే.. ఇటీవలి కాలంలో ఇంతలా వివాదాస్పదమైన సినిమా మరొకటి లేదు. రాజకీయంగానూ ఈ సినిమా పెద్ద దుమారమే లేపింది. సెన్సార్ బోర్డు సూచనల మేరకు కొన్ని సీన్లు తొలగించడానికి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఒప్పుకోవడంతో.. ఎట్టకేలకు సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

Recommended