అగ్రరాజ్యంపై పాకిస్తాన్ ఎదురుదాడి! భారత్‌ ని తిడుతూ ?

  • 6 years ago
Donald Trump has accused Pakistan of lies and deceit, saying America was foolish to have given Islamabad more than $33bn in aid.Pakistan’s Minister of State for Information and Broadcasting Marriyum Aurangzeb said that the US should not blame Pakistan for Washington’s failure in Afghanistan.



అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ట్వీట్ నేపథ్యంలో పాకిస్తాన్.. అగ్రరాజ్యం అమెరికాపై ఎదురుదాడికి దిగింది. అమెరికా తన సైనిక స్థావరాల ఏర్పాటుకు పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకుందని, తమ నిఘా వర్గాలను కూడా ఉపయోగించుకుందని ఆరోపించింది.

16 ఏళ్లుగా తమ సాయాన్ని తీసుకుంటూ.. తమపై అపనమ్మకం పెంచుకున్న అమెరికా ఇప్పుడు తమపైనే దూషణలకు దిగుతోందని పాకిస్తాన్ దుయ్యబట్టింది. అసలు వాస్తవాలను ప్రపంచానికి తెలియజేస్తామంటూ అమెరికాకే తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్, సైనిక సాయం నిలిపివేత నిర్ణయంపై పాకిస్తాన్‌ ప్రధాని షాహీద్‌ ఖాన్‌ అబ్బాసీ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాక్‌ నిఘా సంస్థ అయిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్‌ (ఐఎస్‌ఐ) సహా ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పాకిస్తాన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ట్విట్టర్‌లో మండిపడిన సంగతి తెలిసిందే. ‘అఫ్గానిస్తాన్‌లో మా పోరాటం ఎంతో వ్యయప్రయాసలకు, ప్రాణత్యాగానికి సంబంధించినది. తాలిబాన్లతో మేం పోరాడుతుంటే మా నుంచి సాయం అందుకున్న పాక్‌- అదే తాలిబన్‌కు ఆశ్రయమిస్తోంది. అంటే ఓ రకంగా అమెరికన్లను చంపడానికి పాక్‌ సహకరిస్తోంది. ఇంకా మౌనంగా ఉండలేం. ఈ పరిస్థితి మారాలి.. తక్షణం మారాలి..మా సైనికుల్ని, ఆఫీసర్లను చంపుతున్న వర్గాలకే సాయపడడం అసాధ్యం.. ' అంటూ ట్రంప్‌ ట్వీట్ చేశారు.

Recommended