Rajini On Jayalalithaa : జయలలిత ముఖ్యమంత్రి అయితే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు

  • 6 years ago
In 1996, the actor had taken a strong political stand against Jayalalithaa ahead of the Assembly elections that year. In a speech, Rajini said, “Even God can’t save Tamil Nadu if Jayalalithaa returns to power.” The statement is believed to have turned the tide in the favour of the DMK-Tamil Manila Congress combine in that election.

రజనీకాంత్ ఓ రాజకీయ పార్టీ స్థాపించే స్థాయికి చేరుకోవడం అంత సులభంగా జరిగిందేమీ కాదు. ఓ బస్సు కండక్టర్ తమిళ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. తెరపై ఆయన ఏమైనా చేయగలరు. ఒక్కసారి కెమెరాలు పక్కకు జరిగితే అతి సామాన్యుడైపోతారు. నిజ జీవితంలో నటించడానికి తనకు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదని అంటారు. అభిమానులు ఆయనను దైవ సమానుడిగా కొలుస్తారు. చివరకు ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి రజనీకాంత్ తెగ ఆలోచించినట్లే కనిపిస్తున్నారు. చాలా కాలంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. చివరకు 67 ఏళ్ల రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు.

నిజానికి, రాజకీయాల్లోకి రావడానికి రజనీకాంత్ అంత ఇష్టంగా ఏమీ లేరనే అనిపించింది. రాజకీయాలు ఎంత కష్టమైనవో తనకు తెలుసునని, అందుకే రాజకీయాల్లోకి రావడానికి అంత ఇష్టపడలేదని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే, యుద్దంలోకి దిగితే గెలవాల్సిందేనని ఆయన అన్నారు.
రజనీకాంత్ ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పడానికి వీల్లేదు. రజనీకాంత్ తన అభిమానులకు ఏ సూచన చేస్తారని ఎన్నికల సమయాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూడడం ఆనవాయితీగా మారింది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను కలిశారు. అంటే, రాజకీయంగా రజనీకాంత్ ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి అయితే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేరని 1996లో రజనీకాంత్ చేసిన ప్రకటన సంచలనమే సృష్టించింది. అది డిఎంకె - టిఎంసి కూటమికి కలిసి వచ్చింది. అన్నాయండికె ఓడిపోయింది.ఓ పోలీసు కానిస్టేబుల్ కుమారుడు శవాజీరావు గైక్వాడ్ 1950 డిసెంబర్ 12వ తేదీన జన్మించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌గా ఎదగడానికి చేసిన ప్రయాణం సుదీర్ఘమే. తల్లిదండ్రులు మహారాష్ట్రీయులు బెంగళూరులో నివాసం ఉంటూ వచ్చారు. రజినీకాంత్‌కు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు తల్లి మరణించింది. కుటుంబం పేదరికంతో సతమతమవుతూ వచ్చింది.

Recommended