Rajinikanth political entry : రాజకీయాల్లోకి నో 'కామెంట్' అంటున్న రజనీకాంత్

  • 6 years ago
Rajinikanth is holding such meetings over six days in a second event this year. He had earlier met his fans in May and clicked pictures with them.

ప్రతి మనిషిలోని మంచిగుణాలే ఇతరుల వద్ద వారి విలువను పెంచుతాయని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ అన్నారు. సమయం, సందర్బం వచ్చినపుడు సినిమాలు, రాజకీయాలు తనంతకు తానుగా మారిపోతాయని రజనీకాంత్ జోస్యం చెప్పారు.

అభిమానులతో ఐదోరోజు సమావేశాలను శనివారం రజనీకాంత్ నిర్వహించారు. పోయెస్ గార్డెన్ లోని ఇంటి దగ్గర రజనీకాంత్ ను ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా తమిళనాడులో రాజకీయాలు సాధ్యం అవుతాయా అని మీడియా ప్రశ్నించగా నో కామెంట్ అన్నారు. అభిమానులతో గత ఐదు రోజుల నుంచి వరుసగా భేటీ అయ్యి వారితో ఫోటోలు తీసుకుంటున్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే విషయమై డిసెంబర్ 31వ, తేదిన ప్రకటన చేయనున్నారు.

అంతకముందు రజనీకాంత్ శుక్రవారం నాడు నాలుగో రోజున అభిమాన సంఘాలతో సమావేశమయ్యారు. రాజకీయాల్లోకి ప్రవేశాన్ని కాలమే నిర్ణయిస్తోందని తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు.సినీ నటులు రాజకీయాల్లో రాణిస్తారని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు.శుక్రవారం కోయంబత్తూరు, ఆరోడ్, తిరుప్పూర్, వేలూరు జిల్లాలకు చెందిన అభిమానుల సమావేశంలో రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా తమిళనాడు వాసులే కాదు దేశం మొత్తం రజనీకాంత్ డిసెంబర్ 31న అంటే రేపు ఏం చెబుతారనే విషయమై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఒక్కరోజే టైం ఉండటంతో అయన ఏ నిర్ణయం తీసుకున్నారో అని ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు.

Recommended