ప్రేమ విషయం బయటపెట్టిన మరో స్టార్ క్రికెటర్..

  • 6 years ago
In a recent event, it was revealed that there was a time when Pakistani speedster Shoaib Akhtar was a die-hard fan of Sonali Bendre, the beautiful Bollywood actress.

మైదానాల్లో క్రికెటర్లు కొట్టే షాట్స్ బౌండరీలు దాటి బాలీవుడ్ హీరోయిన్ల గుండెల్లో పడ్డ సందర్భాలు అనేకం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్, టీమిండియా స్టార్ క్రికెటర్స్ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ చాలాకాలంగా సాగుతూనే ఉంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న విరాట్-అనుష్క జంట కూడా ఇదే తరహాలో ఒక్కటయ్యారు. తారలు, క్రికెటర్లు: లవ్ స్టోరీలు అయితే పెళ్లి దాకా వెళ్లని ప్రేమాయణాలు కూడా బాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. ప్రేమాయణం పక్కనపెడితే.. తానైతే ప్రపోజల్ దాకా కూడా వెళ్లలేదని కొత్త విషయం బయటపెట్డాడు మాజీ పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్..
షోయబ్ అక్తర్ ఇటీవల ఓ టీవి చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ప్రేమ వ్యవహారాల గురించి ప్రస్తావన రాగా.. ఇప్పటిదాకా బయటపెట్టని సీక్రెట్ ఒకటి చెప్పారు. బాలీవుడ్ నటి సోనాలి బింద్రేను తాను అమితంగా ప్రేమించినట్లు చెప్పారు.

Recommended