'2 కంట్రీస్' ట్విట్టర్ రివ్యూ..

  • 6 years ago
Sunil's Telugu remake of Malayalam '2 Countries' has been released today with the same name. After his box office debacle with 'Ungarala Rambabu', the romantic comedy entertainer '2 Countries' is receiving positive talk from the audience.


హీరో సునీల్ కెరీర్‌కు ఇప్పుడు అర్జెంటుగా ఒక్క హిట్టు కావాలి. 'హీరో' చట్రంలో ఇరుక్కుని సునీల్ తప్పు చేశాడన్న విమర్శలకు చెక్ పెట్టడానికైనా ఇప్పుడు సునీల్ కు ఒక హిట్ కావాలి.
హీరోగా సునీల్ చేసిన ఒక దశాబ్దపు ప్రయాణంలో.. 'అందాల రాముడు', మధ్యలో మర్యాద రామన్న తప్పితే చెప్పుకోవడానికి పెద్ద హిట్స్ లేవు. కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోవడంతో సునీల్ పరిస్థితి ఒకరకంగా అగమ్యగోచరంగా తయారైంది.
ఇలాంటి తరుణంలో ప్రేక్షకులకు నేడు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన 2కంట్రీస్ సునీల్ ను కాపాడుతుందా?.. ట్విట్టర్ లో నెటిజెన్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం..
2 కంట్రీస్ చిత్ర దర్శకుడు ఎన్.శంకర్ సినిమా ఫలితంపై ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఓవర్ సీస్ లో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందని, అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోందని తెలిపారు. సినిమాకు మీ మద్దతు తెలపాలని కూడా ప్రేక్షకులను కోరారు.
సినిమా ప్రారంభంలో సునీల్ పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేశాడని ఓ నెటిజెన్ అభిప్రాయపడం గమనార్హం.

Recommended