కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలు, ట్విస్ట్ లే ట్విస్ట్ లు !

  • 6 years ago
YCP announced Monday that they withdrew from the by-election of Kurnool MLC. But there is a huge debate going on this matter. So again there is any twist will happen in this issue ? . Tuesday with the completion of the nominations, then matter will clear.

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైసిపి తప్పుకోవడంపై పెనుదుమారం రేగుతోంది. జగన్ మరోసారి తప్పులో కాలేసాడని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే అభిప్రాయం వైసిపి లోని సీనియర్ నేతలు ఆఫ్ ద రికార్డ్ గా అంటున్నారట. మరోవైపు టిడిపితో సహా మిగతా రాజకీయ పార్టీలన్నీ జగన్ నిర్ణయాన్నిఎద్దేవా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసిపి మరో ట్విస్ట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కెఈ ని టిడిపి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కర్నూలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలనుంచి వైదొలగినట్లు వైసీపీ ప్రకటన ఆ పార్టీ నేతలకే కాదు రాజకీయ పార్టీలన్నిటిని షాక్ కు గురిచేసింది.
పోనీ తామే ఆరోపించినట్లు టిడిపి అవినీతి సొమ్ముతో ఈ ఎన్నికలను గెలిచేందుకు సిద్దమైందని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి? టిడిపి డబ్బు రాజకీయం ముందు మేము నిలబడలేకపోతున్నామని ఒప్పుకున్నట్లే కదా అనే ప్రశ్న అన్నివైపుల నుంచి ఉత్పన్నమవుతోంది. అంతేకాకుండా రాజకీయ పరంగా చూసినపుడు తాము ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్రభావం తమ పార్టీ మీద పడుతుందని, తద్వారా పార్టీ మరింత బలహీనపడుతుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నాఅది కూడా సరికాదంటున్నారు.

Recommended