RK Nagar Bypoll Updates ఆర్కే నగర్ ఉపఎన్నిక ఓటింగ్ ప్రారంభం !

  • 6 years ago
Residents of RK Nagar, a constituency in northern Chennai, will start filing into polling centres at 8 AM today to elect the MLA who will succeed J Jayalalithaa in the Tamil Nadu Assembly.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక గురువారం జరుగుతోంది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2.80 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డీఎంకే అభ్యర్థి మరుదుగణేశ్‌, అన్నాడీఎంకే అభ్యర్థి ఇ మధుసూదన్‌, అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్‌, బీజేపీ నేత కరు నాగరాజన్‌లు మధ్యే ప్రధానంగా ఉన్నారు.
ప్రధాన పోటీ మరుదుగణేశ్‌, దినకరన్‌, ఇ. మధుసూదన్‌ల మధ్యనే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. 208 పోలింగ్‌ బూత్‌లున్న ఈ నియోజకవర్గంలో 200 సీసీ కెమరాలు ఏర్పాటు చేసి పోలింగ్‌ సరళిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది.

Recommended