రోజా అలా చేస్తే కాళ్లు పట్టుకుంటా ?
  • 6 years ago
Producer Bandla Ganesh clears that he'll not apologize, rather MLA Roja must apologize. He responded over the complaint of YSRCP to Vijayawada commissioner.

ఒకరేమో ఫైర్ బ్రాండ్.., ఇంకొకరు.. అభిమానంలో 'నాకు నేనే పోటీ' అనుకునేంతటి పవన్ కల్యాణ్ ఫ్యాన్. ఇద్దరి మధ్య చిచ్చు పుడితే అది ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి జరిగిన ఓ చర్చాకార్యక్రమం లో అర్థమయింది.
తాము ఆరాధించే వ్యక్తిని గౌరవం లేకుండా మాట్లాడారని బండ్ల గణేష్.. రాజకీయాల్లో విమర్శలు తప్పవని రోజా.. మొత్తానికి హద్దులు దాటి జనం 'హవ్వా' అనుకునేలా చేశారు. పోనీ.. ఆ తర్వాతైనా దీనికి ఫుల్ స్టాప్ పడిందా? అంటే అదీ లేదు. ఆ చర్చ కార్యక్రమం అనంతరం కూడా వీరిద్దరి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.
నేను మ‌హిళ‌ల‌ను ఎప్పుడూ ఏ మాటా అన‌లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని వాడు, వీడు అంటూ ఎమ్మెల్యే రోజా మాట్లాడారు కాబ‌ట్టే.. నేను ఆమెను అలా అన్నాను. నేను ఏ ప్రాంతం వాడిన‌యినా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానినే. ఆయ‌న‌ను ఏమ‌న్నా అంటే నాకు కోపం రాదా?' అని సినీన‌టుడు, నిర్మాత బండ్ల గణేష్ అన్నారు.
న‌న్ను అరెస్టు చేయాల‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. నేను చేసింది త‌ప్ప‌ని చ‌ట్టంలో ఉంటే నేను చ‌ట్టాన్ని గౌర‌విస్తాను. రోజాగారు నోరు జారారు కాబ‌ట్టే నేను అలా మాట్లాడాను. ప్రాణం పోయినా నేను ఆమెకి క్ష‌మాప‌ణ చెప్పను. ఒకవేళ ప‌వ‌న్‌కి రోజా క్ష‌మాప‌ణ చెబితే నేను రోజా కాళ్లు పట్టుకోవడానికైనా సిద్దం' అని బండ్ల గణేష్ తేల్చి పారేశారు.
Recommended