Parliament Winter Session : పార్లమెంటు శీతాకాల సమావేశాలు
  • 6 years ago
We look forward to having a fruitful session. Hope to see positive approach in this Winter Session. Democracy will surely strengthen," PM Modi said while addressing the media inside Parliament's premises.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు జనవరి 5, 2018 వరకు ఉంటాయి. 22 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశాల్లో లోకసభలో 25 బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. రాజ్యసభలో 39 బిల్లులు పెండింగులో ఉన్నాయి. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు డిసెంబర్ 14న సమావేశమయ్యాయి. సభలో ప్రవేశ పెట్టవలసిన 25 బిల్లుల్లో 14 కొత్తవి ఉన్నాయి. అందులో జీఎస్టీ, ముస్లీం మహిళల హక్కులు తదితర బిల్లులు ఉన్నాయి. కాగా గత ఇరవై ఏళ్లలో అతి తక్కువ రోజులు సమావేశాలు ఈసారే జరుగుతున్నాయి.
కాగా లోక్‌సభలో సంతాప తీర్మానాలు, నివాళుల అనంతరం సభను వాయిదా వేశారు. లోక్‌సభ తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక అంతకముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు కలిసిరావాలని, పార్లమెంటు సమావేశాలను ప్రజలకు ఉపయోగపడేవిధంగా వినియోగించుకోవాలని కోరారు.
Recommended