పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లే..!

  • 6 years ago
2 Countries Movie Audio Launch event held at Hyderabad. Nani, Sunil, Deepa Naidu, Gopi Sundar, N Shankar, BVS RAvi, Dasarath, Raja Ravindra, Bhaskarabhatla, Y Kasi Viswanath, Prudhvi Raj, Srinivasa Reddy, Anil Ravipudi, Gemini Kiran, Malkapuram Shivakumar at the event.

మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన సునీల్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం ''టు కంట్రీస్'' నిర్మాత, దర్శకుడు ఎన్. శంకర్, సంగీతం గోపి సుందర్, ఈ సినిమా కుటుంబ సన్నివేశాలతో పాటు హాస్య ప్రధానంగా కధ సాగుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగింది ముఖ్య అతిధిగా హీరో నని హాజరయ్యారు.
ఈ సందర్బంగా హీరో సునీల్ మాట్లాడుతూ ఈ సినిమా ఫస్ట్ టీజర్ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేశారు. అక్కడి నుండి అంతా పాజిటివ్ గానే జరుగుతోంది. ఇపుడు నాని వచ్చి ఈ ఆడియో రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం సంతోషం. ఎందుకంటే ఆయన ఎయిర్ పోర్టులో షూటింగ్ చేసి అక్కడి నుండి బయల్దేరి ఇక్కడకు వచ్చారు. అప్పట్లో జక్కన్న ఫంక్షన్ సమయంలో చిరంజీవిగారు షూటింగ్ నుండి వచ్చారు. ఆయన తర్వాత నా కోసం షూటింగ్ నుండి వచ్చింది నాని మాత్రమే. నాని తమ్ముడూ... నువ్వు ఇప్పుడు సక్సెస్ అయినదానికంటే వందరెట్లు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నువ్వు బావుండాలి... అని సునీల్ వ్యాఖ్యానించారు.

Recommended