వైరల్ అవుతున్న నమిత పెళ్లి వీడియో..!

  • 6 years ago
Actress Namitha, who rose to fame by playing glamorous roles in movies, got married to actor Veerendra Chowdhary on November 24 in Tirupati. Hailing from Surat, the Pulimurugan actress got married according to Telugu customs.

దక్షిణాది అందాల తార నమిత వివాహం నటుడు, మోడల్ వీరేంద్ర చౌదరీతో ఇటీవల జరిగింది. చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొద్దిమందే హాజరైనప్పటికీ.. అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరి వివాహం పలు సినీ రంగాలకు సంబంధించిన ప్రేక్షకులను, అభిమానులను ఆకర్షించింది. తాజాగా య్యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన నమిత పెళ్లి వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది.
నమిత వివాహం హిందూ ముఖ్యంగా తెలుగు సంప్రదాయం ప్రకారం నవంబర్ 24న తిరుపతిలో వైభవంగా జరిగింది.
పెళ్లి అనంతరం నమిత విడుదల చేసిన ప్రకటనలో.. మాది ప్రేమతోపాటు పెద్దలు కుదిర్చిన పెళ్లి. నాకు వీరేంద్రను నా స్నేహితుడు శశిధర్ బాబు పరిచయం చేశాడు.
పరిచయం ఏర్పడిన ఓ ఏడాది తర్వాత నమితకు ఆయన పెళ్లి చేసుకొందామనే ప్రతిపాదన ముందుంచాడు. అప్పటికే వీరేంద్ర ప్రేమలో మునిగిపోయిన నమిత ఆ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దాంతో నమిత, వీరేంద్ర తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. వీరి పెళ్లికి రాధిక, శరత్‌కుమార్, గాయత్రి రఘురాం, శక్తి పీ వాసు, హారతి, గనేష్కర్ తదితరులు హాజరయ్యారు. వారంతా జీవితాంతం కలిసి ఉండాలని ఆశీర్వదించారు.

Recommended