Mahesh Kathi Posted Cartoons Against Pawan Kalyan Goes Viral

  • 6 years ago
Mahesh Kathi posted cartoons against Pawan Kalyan, pawan fans became angry on Mahesh Kathi. Mahesh Kathi also talking about his range and pawan kalyan range, he told that he had more range than pawan.

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ తన దాడిని ఆపడం లేదు. తన ఫేస్ బుక్ అకౌంటులో వరుసగా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. తన స్థాయి పవన్ కళ్యాణ్ స్థాయి అంటూ మాట్లాడుతున్నారు. పవన్ కంటే తాను పది రెట్లు గొప్ప అని చెబుతున్నారు. ఎవడూ, ఒరే నాయనల్లారా అంటూ కొన్ని పోస్టులు పెట్టారు.
అయితే, కత్తి మహేష్ ఫేస్‌బుక్‌కు పవన్ అభిమానులు దిమ్మతిరిగే షాకిస్తున్నారు. చిరంజీవి లేకుంటే పవన్ ఎక్కడ అని కత్తి మహేష్ పేర్కొన్నారు. దానికి పవన్ అభిమాని.. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ లేకపోతే మీరూ లేరండి అని గట్టి షాకిచ్చారు.ఎవడు నా స్థాయి గురించి మాట్లాడేది? పవన్ కళ్యాణ్ ఇంటర్ ఫెయిల్. నేను పోస్ట్ గ్రాడ్యువేట్. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ లేదు. నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఇంక ఏ స్థాయి కావాలి? గుణమా! కులమా! మాట్లాడకుందామా!?' అని కత్తి మహేష్ ఓ పోస్టులో పెట్టారు.
ఏదైనా ప్రాపగాండా స్ప్రెడ్ చెయ్యాలంటే కొంత హోమ్ వర్క్ చెయ్యండిరా. నేను ఎవరి దగ్గరైన డబ్బులు తీసుకుంటే ఆ చాట్ నేను స్క్రీన్ షాట్స్ తీసి ఎవరికైనా పంపిస్తానా? అని మరో పోస్ట్ పెట్టారు. డబ్బులు తీసుకొని పని చేస్తున్నాననే ఆరోపణలపై ఈ పోస్ట్ పెట్టారు.

Recommended