Team India Sixth Position Player In Suspense

  • 6 years ago
Ahead of South Africa tour The team india will leave for South Africa on December 27.

మున్ముందు చేయాల్సిన ద‌క్షిణాఫ్రికా టెస్టును దృష్టిలో ఉంచుకున్న‌ భార‌త్‌కు పెద్ద స‌వాల్ ఎదురైంది. జ‌ట్టులో ఆరో స్థానం ఎవ‌రికి ఇవ్వాల‌నేదే సందిగ్ధం. మొద‌టి ఐదుగురు బ్యాట్స్‌మెన్స్‌తో ఏడు నుంచి మిగ‌తా అయిదు మంది బౌల‌ర్లుగా అనుకుంటే మ‌రి ఆరో స్థానం ఎవ‌రికి ద‌క్కాలి. అయితే ఈ స్థానానికి ఆల్‌రౌండ‌ర్ అయితే క‌రెక్ట్ అని ప‌లువాద‌న‌లు వినబ‌డుతున్నాయి. ప్రస్తుతం ఈ స్థానం కోసం రోహిత్, హార్దిక్ పాండ్యా మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. స‌రిగ్గా స‌రిపోయే అభ్య‌ర్థిని ఎంచుకోవాల్సిన విరాట్ కోహ్లీ ఎవ‌ర్ని ఎంచుకుంటాడన్నది ఆసక్తికర‌మైన అంశం.
అయితే మరో మూడు వారాల్లో టీమ్‌ఇండియాకు దక్షిణాఫ్రికా గడ్డపై కఠినమైన బౌన్సీ పిచ్‌లు ఎదురుకానున్నాయి. ఉపఖండంలో అశ్విన్ ఈ స్థానాన్ని కొంత భర్తీ చేసినా.. దక్షిణాఫ్రికాలో ఈ వ్యూహం పని చేయదని కెప్టెన్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే ఈ స్థానం కోసం హార్దిక్ పాండ్యాను తీసుకోవాలని భావిస్తున్నాడు. ఎందుకంటే లంక పర్యటనలో ఎనిమిదో నంబర్‌లో దిగి పాండ్యా సెంచరీ కొట్టాడు. దక్షిణాఫ్రికాలో పాండ్యాను ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు దింపడం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఎందుకంటే ఈ స్థానంలో ఆడే ఆటగాడు చాలా రాటుదేలి ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఫలితమే మారిపోతుంది. కానీ ఇప్పుడిప్పుడే ఐదు రోజుల ఫార్మాట్ మొదలుపెట్టిన పాండ్యాకు అంతగా అనుభవం లేదన్నది మాజీల అభిప్రాయం.

Recommended