AP Will Get Special Status Before Elections? | Oneindia Telugu
  • 6 years ago
If one were to go by the reports coming from political circles in New Delhi, the Bharatiya Janata Party-led National Democratic Alliance government at the Centre might announce special category status to Andhra Pradesh just before 2019 elections.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖాయం అని దేశ రాజధాని లోని రాజకీయ సర్కిళ్లలో వదంతులు షికారు చేస్తున్నాయి. ప్రత్యేకించి కేంద్రంలో బీజేపీ సారథ్యం వహిస్తున్న (ఎన్డీయే) సర్కార్ 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ప్రకటించాకే.. ప్రజా తీర్పు కోసం ముందుకు వెళ్లనున్నదని వినికిడి. ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీతో సంబంధ బాంధవ్యాలు తెగదెంపులు చేసుకోవడానికి ముహూర్తం కోసం.. సరైన సమయం కోసం కమలనాథులు వేచి చూస్తున్నారని వినికిడి. అలా సరైన టైంలో టీడీపీతో తెగదెంపులు చేసుకున్నాక.. ప్రత్యేక హోదాపై అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.
ఏపీలో భారీగా లోక్ సభ స్థానాలు గెలుచుకుని తన పునాదిని బలోపేతం చేసుకోవాలని కమలనాథులు వ్యూహం రూపొందిస్తున్నారు. దక్షిణాదిలో బలం పెంచుకోవాలని కలలు కంటున్న బీజేపీ.. టీడీపీతో పొత్తు తెంచుకుని..ప్రతిపక్ష వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని కనీసం 12 మంది ఎంపీలను గెలుచుకోవాలన్న లక్ష్యం బీజేపీ మదిలో ఉన్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా ఒక షరతు పెట్టారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించకుండా ఆ బీజేపీతో చేతులు కలుపబోమని వైఎస్ జగన్ అన్నారని తెలుస్తున్నది.
Recommended