5 years ago

Nara Lokesh Counter to Pawan Kalyan | Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
IT Minister Nara Lokesh counter to Jana Sena cheif Pawan Kalyan for his comments.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి చురకలు అంటించారు. ఆస్తులపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేతకు, వారసుల అంటూ కామెంట్ చేసిన జనసేనానికి దిమ్మతిరిగే షాకిచ్చారు.
వైయస్ జగన్, ఆయన పార్టీ నేతలు తమపై మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారని మొదట వాళ్లు ఆస్తులను తమ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతరులపై విమర్శలు చేసే ముందు మేం ఆ పని చేస్తున్నామా అని ఆలోచించాలన్నారు. ఆ తర్వాత తమ తప్పులు ఉంటే ఆరోపణలు చేయాలని అభిప్రాయపడ్డారు.వైయస్ జగన్ ఆస్తులను ఈడీ, సీబీఐ ప్రకటిస్తున్నాయని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పుడూ సొంతంగా ఆస్తులు ప్రకటించలేదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ పైన 17 కేసులు వేశారని, కానీ ఒక్క దానిని నిరూపించలేకపోయారన్నారు.

Browse more videos

Browse more videos