సినిమా సెట్లోనే హీరో పై దాడి.. చేసింది ఎవరంటే..?

  • 6 years ago
Arjun Kapoor who is currently shooting in Uttarakhand for his film, Sandeep aur Pinky Faraar was allegedly assaulted by a drunk man on sets. The man, who is a driver by profession, has been arrested.

బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్‌పై దాడి జరిగింది. సందీప్ ఔర్ పింకీ పరార్ అనే సినిమా షూటింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్నది. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో అర్జున్ కపూర్ స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.
డిసెంబర్ 4న (సోమవారం) ఉదయం ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అర్జున్ కపూర్ వద్దకు వచ్చాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు చేయి చాపగానే చేతిని మెలిపెట్టాడు. ఆ తర్వాత ఆయనపై దాడి చేశాడు. ఆ సమయంలో పిథోర్‌గఢ్ అనే ప్రాంతంలో అర్జున్ వ్యానిటీ వ్యాన్‌ వద్ద ఉన్నాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని కమల్ కుమార్ అని, అతడు ఓ డ్రైవర్ అని గుర్తించారు.
అర్జున్ కపూర్‌పై దాడికి పాల్పడిన కమల్ కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం డ్రైవర్ కారును పోలీసుల స్వాధీనం చేసుకొన్నారు.
సందీప్ ఔర్ పింకీ ఫరార్ అనే చిత్రంలో అర్జున్ కపూర్ పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. చాలా కఠినమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ పొందాడు. ఈ చిత్రంలో హై ప్రొఫైల్ నేరస్థుల భరతం పట్టే పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అర్జున్ కపూర్ సరసన పరిణితి చోప్రా నటిస్తున్నది.

Recommended