సైఫ్ కూతురు కోసం ఇంత భారీ సెట్ ఆ ?
  • 6 years ago
Sushant Singh Rajput and Sara Ali Khan recently concluded their first leg of the shoot for Kedarnath in the foothills of Himalayas, where the film is based. The team begins shooting for the second schedule within a few days in Mumbai.

బాలీవుడ్‌లో వచ్చే ఏడాది సూపర్‌స్టార్ల వారసుల హడావిడి మొదలు కాబోతున్నది. శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీఖాన్ సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. జాహ్నవి సైరత్ రీమేక్‌లో నటిస్తుండగా, సారా ఆలీఖాన్ కేదారినాథ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.
హిమాలయ పర్వత శ్రేణుల్లో కేదారినాథ్ షూటింగ్ ఇటీవల పూర్తయింది. తర్వాత షెడ్యూల్ కోసం ముంబైలో కేదారినాథ్ ఆలయం, దాని పరిసరాలను తలపించే విధంగా భారీ సెట్ నిర్మించారు. కేదారినాథ్ ఆలయ మాదిరిగా నిర్మించిన సెట్‌ను చూసి చిత్ర యూనిట్ ఒకింత నివ్వెరపాటుకు గురైందట. ప్రస్తుతం ముంబై ఫిల్మ్ సిటీలో ఈ సెట్ గురించి రకరకాలుగా చర్చించుకొంటున్నారట.
కేదారినాథ్ చిత్రం కథలో భాగంగా భారీ వరదలు ముంచెత్తే సీన్లను త్వరలోనే చిత్రీకరిస్తారట. ఇందుకోసం భారీ వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారనేది తాజా సమాచారం.
Recommended