ప్రియుడితో శృతి హాసన్ వివాహం ?

  • 6 years ago
Recently, Shruti Haasan made her boyfriend Michael meet her mom Sarika. And pictures of the trio spotted together have gone viral.

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుటుంబంలో పెళ్లి భాజా మ్రోగ బోతోందా? ఆయన కూతురు, హీరోయిన్ శృతి హాసన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి చెన్నై సినీ వర్గాల నుండి. శృతి హాసన్ ఓ విదేశీయుడితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటాలియన్ సంతతికి చెందిన మైఖేల్ కోర్సేల్‌తో శృతి హాసన్ కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. లండన్లో స్టేజ్ యాక్టర్‌గా రాణిస్తున్న మైఖేల్‌ తన ప్రియురాలు శృతి హాసన్ కోసం చాలా సార్లు ఇండియా వచ్చారు.
త్వరలో శృతి హాసన్, మైఖేల్ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇద్దరూ కమల్ హాసన్ తో చర్చించినట్లు సమాచారం. అంతా సవ్యంగా జరిగితే త్వరలో కమల్ హాసన్ ఇంట్లో శుభకార్యం చూడబోతున్నాం.
శృతి హాసన్ ఏ విషయంలో అయినా ఓపెన్ మైండెడ్. ఎలాంటి దాపరికాల్లేకుండా శృతి హాసన్, మైఖేల్ ఇండియాలో చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలోనే ఇద్దరూ వివాహానికి సిద్ధమైనట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Recommended