మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు....కానీ..?
  • 6 years ago
Mera Bharath Mahan new telugu movie launched today at hyderabad.

ప్రత ప్రొడక్షన్స్ బ్యానర్ పై ''భరత్'' డైరెక్టర్ గా నిర్మాతలు.డా.శ్రీధర్ రాజు,డా.తాళ్ల.రవి,డా.టి.పి.ఆర్.కలిసి నిర్మిస్తున్న చిత్రం''మేర భారత్ మహాన్''ది అర్జెన్సీ ఆఫ్ చేంజ్.,ఉప శిర్షిక,ఈ సినిమాని ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో లాంచనంగా మొదలు పెట్టారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దర్శకుడు సాగర్,దర్శకుడు.బి.గోపాల్,గీత రచయిత.చంద్ర బోస్ హాజరయ్యారు.
ఈ సినిమా దర్శకుడు భరత్ మాట్లాడుతూ ఈ సినిమా కధ చాలా బాగుంటుంది కొంచం గ్యాప్ తర్వాత నేను చేస్తున్నా సినిమా.
ఇది ఒక భారతియుడు,అపరిచితుడు,ఠాగూర్ లాంటి సినిమా కమర్షియల్ గానే వుంటూ మంచి సందేశం కూడా వుంటుంది,ముఖ్యంగా ఈ సినిమాలో మేం చర్చించే అంశాలు చదువు,వైద్యం,ఈ రెండు అంశాలు ఈ రోజు సమాజంలో కీలకమైనవి ఇవి సగటు మానవుడికి కావాల్సిన కనీస అవసరాలు,కాని ఇవే మనకు దొరకడం లేదు అందుకే ఈ సినిమా ద్వారా ప్రభుత్వాని అడగబోతున్నాం.,మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కాని ప్రభుత్వం చెయ్యాల్సిన పనులను గుర్తించడం మా భాద్యత,ఈ సినిమాని శంకర్ రేంజ్ సినిమాగా తెరకేక్కిస్తం అంతే కాదు ఈ సినిమాలో ఇంకో ప్రత్యకమైన రోల్ వుంది ప్రస్తుతం అతను స్టార్ ఆక్టర్ అయన కూడా ఈ సినిమాలో నటిస్తారు అని సినిమా పైన తనకున్న నమ్మకాని తెలుపుతూ సినిమా పైన అంచనాలను పెంచారు.
Recommended