నేను కంటతడి పెట్టిన సంఘటన అదే !
  • 6 years ago
Producer Raj Kandukuri's latest movie is Mental Madhilo. This movie going good at Overseas and local market. This movie is getting huge applause from all sectors.

పెళ్లి చూపులు నిర్మాతగా రాజ్ కందుకూరి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా మెంటల్ మదిలో చిత్రంతో మరోసారి ఓ ఫీల్‌గుడ్ చిత్రంతో ముందుకొచ్చాడు. సక్సెస్‌ఫుల్ నిర్మాతగా మారడం వెనుక ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు రాజ్ కందుకూరి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైన గానీ తన లక్ష్యాన్ని మాత్రం వదులేదు. మార్కెటింగ్ మేనేజర్‌గా, గ్రానైట్ వ్యాపారిగా, కాలేజీ యజమానిగా, టెలివిజన్ షో రూం ఓనర్‌గా, యూఎస్‌లో కన్సల్టెంట్‌గా అనేక అవతారాలు ఎత్తినప్పటికీ సినిమాను వదులుకోలేదు. చివరికి నంది, జాతీయ అవార్డులతో ఉత్తమ నిర్మాతగా నిలిచారు. ఇలాంటి నేపథ్యంలో రాజ్ కందుకూరి తన వ్యక్తిగత, ఫ్రొఫెషనల్ విషయాలను ఓ యూట్యూబ్ ఛానెల్‌తో పంచుకొన్నారు.
నాన్న గారి కోరిక మేరకే నేను సినిమా రంగంలోకి ప్రవేశించి గౌతమ బుద్ద అనే సినిమాను రూపొందించాను. ఆ చిత్రానికి నంది అవార్డు లభించింది.
ఆ తర్వాత చాలా సినిమాలు తీసాను. అన్ని దారుణంగా బోల్తాపడ్డాయి. ఆర్థికంగా నష్టపోయాను. పరిస్థితి బాగాలేకపోవడం అమెరికాకు వెళ్లాను. తిరిగి ఇండియాకు వచ్చాక 4.5 లక్షలు పెట్టి సాంత్రో కారు కొన్నాను. కారు కొన్నాక నెలరోజుల్లోనే నెల నిండకుండా నా కూతురు పుట్టింది. అప్పుడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. దాంతో కారును 3.5 లక్షలకు అమ్మేశాను. నా జీవితంలో నేను కంటతడి పెట్టిన సంఘటన అదే.
పెళ్లి చూపులు సినిమా అంతా పూర్తయిన తర్వాత నేను, తరుణ్ ఓ డిస్టిబ్యూటర్ వద్దకు వెళ్లాం. ఆయనకు సినిమా గురించి చెప్పి పెళ్లిచూపులు అని టైటిల్ పేరు చెప్పినప్పుడు.. ఇదేం టైటిల్. 30 ఏళ్ల క్రితం నాటి సినిమాలా అనిపిస్తున్నది. టైటిల్ వింటేనే సినిమా నడవదు అనిపిస్తున్నది. లాభం లేదు అని ఆయన అన్నాడు. ఆ వ్యక్తి అలా అనేటప్పుడు తరుణ్ భాస్కర్ కళ్లలో నీళ్లు తిరిగాయి.అర్జున్‌రెడ్డి సినిమా కథను సందీప్‌రెడ్డి వంగ నాకు చెప్పాడు. ఆయన కథను చెప్పిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను. అయితే నేను నిర్మాతగా ఉంటాను అని చెప్పగా.. మా అన్నయ్యతో కలిసి సినిమా చేస్తున్నాను అని చెప్పడంతో వీలుకాలేదు.
Recommended