Weekly Rasi Phalalu Telugu రాశి ఫలాలు 26-11-2017 To 02-12-2017 | Oneindia Telugu
  • 6 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 26 వ తేదీ ఆది వారం నుండి డిసెంబర్ 2 వ తేదీ శనివారం వరకు రాశి ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. శుద్ద అష్టమి రాత్రి తెల్లవారితే 5 గంటల 20 నిమిషముల వరకు వుంది. ధనిష్ఠ నక్షత్రం ఉదయం 10 గంటల 58 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి తలచిన కార్యక్రమాలు అనుకున్నట్టుగా జరుగుతాయి. బంధు మిత్రుల తో సంతోషంగా గడుపుతారు. అధికారుల మన్ననలు పొందుతారు. భార్య సహకారం వుంటుంది. పిల్లల విషయం లో జాగ్రత్త అవసరం.గౌరవ మర్యాదలు పొందుతారు.అధికారుల ప్రసంసలు అందుకుంటారు.తల్లి తండ్రుల ఆశీర్వాదాలు మేలు చేయగలవు. తలచిన పనులు బాగా సాగుతాయి. భార్య సహకారం ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు బాగా కొనసాగుతాయి. పెద్దల సలహా తీసుకోండి. పిల్లలపై శ్రద్ద వహించండి. సుబ్రహ్మణ్య ఆరదన చేయండి. అభివృద్ధి కొరకు ప్రణాళికలు చేస్తారు. వృషభ రాశి వారికి యాత్రలకు సంబందించిన విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తారు.వృత్తి వ్యాపారాలు సామ్యం గా కొనసాగుతాయి. పిల్లలు పట్టుదలగా అనుకున్నది సాధిస్తారు. మిధున రాశి వారికి స్థలాలకు సంబంధించిన విషయాలు త్రుప్తినిస్తాయి.భార్య పట్ల శ్రద్ద అవసరం. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు సక్రమంగా సాగుతాయి..
Recommended