YS Jagan Padayatra : దివ్యాంగుల పెన్షను రూ.1500 నుంచి రూ.3000కి
  • 6 years ago
YSR Congress party president YS Jagan has continued his praja Sannkalpa Yatra on Saturday.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శనివారంనాడు కొనసాగింది. శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరైన ఆయన తన యాత్రను శనివారంనాడు కొనసాగించారు. పత్తికొండ నియోజకవర్గం చెరుకులపాడు చేరుకున్న ఆయనకు ప్రజలు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను ప్రజలు ఆయనకు వివరించారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించారు.
ఎడ్ల బండి ఎక్కి చెర్నాకోలా చేతబట్టారు. ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి సమాధిని వైఎస్‌ జగన్‌ సందర్శించి, నివాళులు అర్పించారు.
పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను జైపాల్‌ రెడ్డి అనే దివ్యాంగుడు కలిశాడు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల పెన్షన్లను రూ.1500 నుంచి రూ.3000కి పెంచాలని కోరారు. దాంతో పాటు రేషన్‌ షాపుల ద్వారా అందిస్తున్న బియ్యాన్ని 35 కెజీలకు పెంచాలని కోరాడు. దానికి జగన్ సానుకూలంగా స్పందించారు.
Recommended