China plans For More Dams On Tibetan Rivers | Oneindia Telugu
  • 6 years ago
India had flagged its concerns to China about various dams being built by it on the Brahmaputra river

చైనా బ్రహ్మపుత్ర నదిపై డ్యాం నిర్మించేందుకు సన్నాహాలు చేయడం లేదని, కానీ టిబెట్ ప్రాంతంలో హైడ్రోపవర్ ప్రాజెక్టులు, తమ ఆదీనంలో ఉన్న నదుల పైన డ్యాంలు నిర్మించేందుకు సిద్ధమవుతోందని చైనా స్టేట్ మీడియా తెలిపింది. బ్రహ్మపుత్ర నదిని తరలించేందుకు చైనా 1000 కిలో మీటర్ల మేర ఓ సొరంగం తవ్వుతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది అసత్య ప్రచారం అని చైనా కొట్టి పారేసింది. తాము అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని తేల్చి చెప్పింది.
బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు వస్తున్న కథనాలను చైనా అధికారవర్గాలు ఖండించాయి. టిబెట్‌లో పుట్టే నదిని అక్కడ యార్లంగ్‌సాంగ్పోగా వ్యవహరిస్తారు. అనంతరం పెద్ద మలుపు తీసుకొని భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి వస్తుంది. అనంతరం అసోంలో ఈ నదిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు.టిబెట్‌ నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర సొరంగం నిర్మించి చైనాలోని ఉత్తరాది ప్రాంతాలకు నీటి సౌకర్యం కల్పించాలన్న చైనా యోచనను గతనెలలో అనేక పత్రికలు తమ కథనాల్లో ప్రచురించాయి. అయితే ఈ కథనాలను చైనా వర్గాలు కొట్టిపారేశాయి.
టిబెట్‌లోని హిమనీ నదాల్లో పలు నదులు జన్మిస్తాయి. వీటిలో జిన్షా, లంకాంగ్‌, న్యుజింగ్ తదితర నదులపై మాత్రమే కొత్త నిర్మాణాలు చేపట్టనున్నట్టు చైనా తెలిపింది. వీటితో బ్రహ్మపుత్రకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.