Hyd Metro Rail Latest Information : Tickets Rates, Luggage Charges | Oneindia Telugu
  • 6 years ago
Hyderabad Metro Rail Services would launch on next Tues day but real services should starts from Wednesday. In the technical grounds service at every 15 minutes upto 6 months. Experts says that after Six months every 3 minutes service would starts.

వచ్చే మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్న హైదరాబాద్‌ మెట్రో.. లాంఛనంగా ప్రజలకు సేవలందించనున్నది బుధవారం నుంచే సుమా. అదీ కూడా 29వ తేదీన ప్రతి 15 నిమిషాలకో రైలు సర్వీసు చొప్పున నడుస్తుంది. సాంకేతికంగా భద్రతా పరీక్షలు నిర్వహించిన తర్వాత మూడు నిమిషాలకో సర్వీస్ భాగ్య నగరి వాసులకు అందుబాటులోకి వస్తుంది. ఇది ఆరు నెలలపాటు పరిమితంగానే తిరగబోతోంది. కొత్తగా నిర్మించిన లైన్‌లో అధికంగా మెట్రో సర్వీసులు తిప్పితే సాంకేతిక ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో మెట్రో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలలపాటు ఈ లైను స్థిరత్వాన్ని నిపుణులు పరిశీలించే వరకు ప్రస్తుతం ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు తిరగనున్నది. ఆరు నెలల తర్వాత ఈ కారిడార్‌లో ప్రయాణికుల రద్దీని బట్టి మూడు నిమిషాలకు ఓ రైలు తిప్పాలా ఐదు నిమిషాలకు తిప్పాలా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మెట్రో అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం మెట్రో 57 రైళ్లను తెప్పించింది. ఇందులో రెండు రైళ్లను తాత్కాలిక ప్రాతిపదికన నాగ్‌పూర్‌ మెట్రోకు ఇచ్చింది. మియాపూర్‌- నాగోలు కారిడార్‌లో ప్రారంభంలో మూడు కోచ్‌లతో 17 రైళ్లను నడపాలని నిర్ణయించారు. అవసరమైన మేరకు రైళ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు.
Recommended