Virat Kohli Upset Ahead Of South Africa Tour | Oneindia Telugu

  • 6 years ago
Ahead of Indian Cricket team’s South African tour in January, Indian Skipper Virat Kohli complained that the schedule is so crammed that the team is not getting enough time to prepare themselves for the series

ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా వరుస క్రికెట్‌ సిరీస్‌లు నిర్వహిస్తున్న బీసీసీఐపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫైర్ అయ్యాడు. వరుస సిరీస్‌లు నిర్వహించేటప్పడు ఆటగాళ్ల కోణంలో సైతం ఆలోచించాలని బీసీసీఐకి హితవు పలికాడు. గత్యంతరం లేకనే వరుస సిరీస్‌లు ఆడాల్సి వస్తుందని బీసీసీఐపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.శ్రీలంకతో సిరీస్‌లో మాత్రం తనకు ప్రత్యేకంగా బౌన్సీ పిచ్‌లే కావాలని కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ కోల్‌కతా పిచ్‌ని మనం ఇప్పటికే చూశాం, ఇప్పుడు నాగ్‌పూర్‌లోనూ అలాంటి పిచ్ ఉందని అన్నాడు. దీంతో ఎందుకిలా? మీరే బౌన్సీ పిచ్‌లు తయారు చేయమని అడిగారా? అని కోహ్లీని ప్రశ్నించగా అతను నేరుగానే సమాధానమిచ్చాడు. 'అవును. ఎందుకంటే మాకు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడానికి ఎక్కువ సమయం లేదు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత రెండు రోజులకే దక్షిణాఫ్రికా ఫ్లయిటెక్కాల్సి ఉంది. దీంతో మాకు ఉన్న ఈ ఒక్క అవకాశం వాడుకోవడం తప్ప మరో దారి లేదు' అని కోహ్లీ అన్నాడు. 'టెస్టు మ్యాచ్‌ ఫలితం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ జడ్జిమెంట్ ఇస్తారు. ఓడిపోతే ప్లేయర్స్‌ను తిడతారు. కానీ సిరీస్ కోసం సన్నద్ధమవడానికి ఎంత సమయం దొరికిందో ఎవరూ ఆలోచించరు. అందుకే ఇప్పుడు పరస్థితుల్లో బౌన్సీ పిచ్‌లు తయారు చేసుకొని ఆ పరిస్థితులకు అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నాం' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

Recommended