రత్తాలు లవ్యూ టూ అంటూ.. చిరంజీవి వీడియో

  • 6 years ago
Tollywood Megastar chiranjeevi best wishes to Julie 2 Team and Lakshmi rai, on her movie Julie 2 release

లక్ష్మీ రాయ్ లేటెస్ట్ మూవీ 'జూలీ-2' శుక్రవారం ( అక్టోబర్ 24) ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 ఏళ్ల క్రితం విడుదలై సంచలనం రేపిన 'జూలీ' సినిమాకు సీక్వెల్ గా ఈ జూలీ పార్ట్ టూ వస్తోంది. అప్పట్లో నేహాదూపియా ఆ సినిమాతో సంచలనం రేపింది. ఇప్పుడు 'జూలీ-2'లో లక్ష్మీ రాయ్ టైటిల్ పాత్రను పోషిస్తోంది. శుక్రవారం విడుదలకానున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వినూత్న పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా లక్ష్మీరాయ్‌కి, ‘జూలీ-2'‌ చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ చిరంజీవి వీడియోలో బెస్ట్ విషెస్ తెలిపాడు అసలు మామూలుగానే తన పని తాను చేసుకుపోయే మెగాస్టార్ పర్సనల్ గా హెల్ప్ చేయటం లాంటివి తప్ప పెద్దగా ఇతరుల సినిమాలకి ప్రచారం చేసేలాంటి పని పెట్టుకోడు.
ఒక రకంగా ఈ జోక్యం చేసుకోని తనమే మెగాస్టార్‌ని ఇండస్ట్రీ లో వివాదరహితుడిగా ఉంచింది. కానీ ఇన్నాళ్ళకి రాయ్ లక్ష్మికి మాత్రం ఆ లక్ చిక్కింది. ఏకంగా ఒక వీడియో సందేశమే పంపాడు చిరు... ఇక రాయ్ లక్ష్మి ఆనందం ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా...
వీడియోలో మాట్లాడిన చిరంజీవి రాయ్ లక్ష్మికీ, జూలీ 2 టీమ్‌కీ శుభాకాంక్షలు చెప్పాడు. ‘హాయ్ రాయ్ లక్ష్మీ. బాలీవుడ్‌లో నీ మొదటి సినిమా విడుదలకానున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా నీకు చాలా ప్రత్యేకమైనదని తెలుసు.

Recommended