Syeda Salva Fatima : గర్భంతోనే 15 గంటల పాటు విమానం నడిపి, అరుదైన రికార్డుల హైద్రాబాదీ

  • 7 years ago
Meet Syeda Salva Fatima, a 27 year old girl who has learnt to fly. Clad in a burqa Fatima looks like a normal muslim girl until she reveals her super-power which is being able to fly

కృషి, పట్టుదలతో పేదింటి ముస్లి యువతి తన లక్ష్యాన్ని సాధించింది. అనేక సమస్యలు అడ్డొచ్చినా కానీ, ఆ యువతి తన లక్ష్యాన్ని చేరుకొంది. కమర్షియల్ పైలెట్‌ లైసెన్స్ పొందిన నాలుగో ముస్లిం యువతిగా చరిత్ర సృష్టించింది. హైద్రాబాద్‌కు చెందిన సల్వా ఫాతిమా కమర్షియల్ పైలెట్‌ లైసెన్స్ పొంది ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, తమ లక్ష్య సాధనకు కృషి చేసి విజయం సాధించిన వారు అరుదుగా కన్పిస్తున్నారు.తమ లక్ష్యాల సాధనలో ఎదురైన అడ్డంకులను అధిగమిస్తేనే తుది లక్ష్యానికి చేరుకొంటారు.
కడు పేద కుటుంబంలో జన్మించిన సల్వా ఫాతిమా పైలెట్ కావాలనే తన కోరికను నెరవేర్చుకొంది.టీవీల్లో పైలెట్స్‌,ను చూసినప్పుడు పైలెట్ కావాలనే కోరిక పుట్టిందని సల్వా ఫాతిమా చెప్పారు. సల్వా ఫాతిమా తండ్రి అహ్మద్ బేకరీలో పనిచేసేవారు. ఆయనకు అతి తక్కువ వేతనం వచ్చేది. పిల్లల కడుపు నింపడమే కష్టంగా ఉండేది. అయితే పైలట్‌కు సంబంధించి పేపర్‌లో ఎలాంటి కథనాలు వచ్చినా చదివేదాన్నని సల్వా ఫాతిమా చెప్పారు..