అఙ్ఞాతవాసి ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది.. ఆడియో డేట్ ఇదే

  • 6 years ago
Power Star Pawan Kalyan fans are eagerly waiting for the release of PSPK25 under the direction of Trivikram. According to the latest buzz, the first look poster of this film will be released on November 25th and Audio on December 15 2017

పవన్ - త్రివిక్రమ్ ల కాంబోలో 'అజ్ఞాతవాసి' ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ 25 వ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. జల్సా అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి.
త్వరలో వారణాసిలో ఈ సినిమా చివరి షెడ్యూల్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ - అనిరుధ్ కంపోజ్ చేసిన `బయటికొచ్చి` చూస్తే లిరికల్ సాంగ్ - హీరోయిన్ కీర్తి సురేశ్ -పవన్ ల లుక్స్ ...ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచాయి.
అయితే ఇప్పటివరకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ బయటికి రాకపోవడమే కాకుండా పలుమార్లు వాయిదా పడడం అభిమానులను నిరుత్సాహపరిచింది. అయితే వారందరికీ డబుల్ ధమాకా ఇచ్చేందుకు 'అజ్ఞాతవాసి` చిత్ర యూనిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఆ చిత్ర ఫస్ట్ లుక్ - ఆడియోను రిలీజ్ చేసి పవన్ అభిమానులను మెస్మరైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
ఈ నెల 25వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు టాలీవుడ్ లో పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ కు సన్నాహాలు కూడా జరుగుతున్నాయట.

Recommended